ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల స్థాయి పెరిగిపోయిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే మన సినిమాలకు కానీ.. మన హీరోలకు కానీ భారీగానే డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇలానే బాలీవుడ్ నటీనటులు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సౌత్ సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి బాహుబలితోనే మన సినిమా స్థాయిని పెంచాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి నిరూపించాడు. ఇక అల్లు అర్జున్ పుష్పవిషయానికొస్తే ఈసినిమా నార్త్ లో చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు నచ్చడం ఒక ఎత్తైతే అక్కడ ప్రేక్షకులు కూడా ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు. అంతేనా పుష్ప గెటప్ లు మరీ వేస్తూ సందడి చేస్తున్నారు ఇంకా. మాస్ అండ్ రస్టిక్ లుక్ లో అల్లు అర్జున్ కు అలానే అతని నటనకు ఫిదా అయిపోయారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈసినిమాపై ఓ రేంజ్ లో ప్రశంసలు కరిపించారు. కొంతమంది అయితే ఏకంగా బన్నీతో నటించాలని ఉంది అని కూడా చెప్పినవారు ఉన్నారు. ఇక ఇప్పుడు ఈలిస్ట్ లో షాహిద్ కపూర్ చేరిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షాాహిద్ కపూర్ తనకు సౌత్ లో అల్లు అర్జున్ తో నటించాలని ఉంది అన్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది అని కూడా తెలిపాడు. చూద్దాం మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడైనా సినిమా వస్తుందేమో..
కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో షాహిద్ కు జోడీగా మృణాళిని ఠాకూర్ నటిస్తుంది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ, శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈసినిమాను హిందీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: