‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad about RRR Movie Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Latest News,RRR Sequel Updates,Jr NTR About RRR Movie Sequel,RRR sequel on the cards,Ram Charan as Alluri Sitarama Raju, Vijayendra Prasad Story Writer,Vijayendra Prasad SS Rajamouli Father,Rajamouli Father Vijayendra Prasad,Vijayendra Prasad About RRR Movie,Jr NTR as Komaram Bheem,SS Rajamouli RRR Movie,RRR sequel,Jr NTR,Ram Charan,SS Rajamouli,RRR Part 2,RRR Blockbuster Movie,RRR Success party,Rajamouli Dance on Naatu Naatu Song

దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తే ఎలా ఉంటుందో మరోసారి ఆర్ఆర్ఆర్ తో నిరూపించాడు. నాలుగేళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రాజమౌళి సాలిడ్ హిట్ ను అందించాడు. వీరిద్దరి పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సినిమా అత్యద్భుతమైన విజ్యువల్ వండర్ లా ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈసినిమా రిలీజ్ అయి పది రోజులు పూర్తవుతున్నా ఇంకా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు తాజాగా సక్సెస్ పార్టీ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఈ పార్టీకి టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్ అందరూ హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సీక్వెల్ గురించి కూడా పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కూడా పలుమార్లు ఈ సీక్వెల్ గురించి ప్రస్తావించారు కూడా. సీక్వెల్ కు పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఇక తాజాగా జరిగిన సక్సెస్ పార్టీలో కూడా విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ… ఈ సినిమా సీక్వెల్ పాజిబులిటీ ఉందన్నారు.

మరి ఏం జరగాలన్నా రాజమౌళి చేతిలోనే ఉంది. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తరువాత సినిమా మహేష్ తో చేస్తున్నాడు. ఈసినిమా కూడా భారీ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పాడు. ఈసినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఒకవేళ ఈసినిమా అయి పోయిన తరువాత రాజమౌళి ఇంకేం సినిమా తీస్తాడో ఎవరికీ తెలీదు. రాజమౌళి మైండ్ లో ఏముందో.. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.