“ఆర్ ఆర్ ఆర్” నాటు నాటు సాంగ్ కు రాజమౌళి , అనిల్ రావిపూడి డ్యాన్స్

Rajamouli And Anil Ravipudi Dance For Naatu Naatu Song At RRR Success Party,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajamouli And Anil Ravipudi,Rajamouli And Anil Ravipudi Dance For Naatu Naatu Song,Jr NTR And Ram Charan,Rajamouli Dance For Naatu Naatu Song,Naatu Naatu Song,RRR,RRR Movie, Rajamouli And Anil Ravipudi Step For Naatu Naatu Song,Dil Raju,Ace Producer Dil Raju,Dil Raju Movies,Dil Raju with RRR Team,Dil Raju Party with RRR Movie Team,Dil Raju Special party,RRR Success party,RRR Movie, RRR Telugu Movie,RRR Success Celebrations,RRR Success Special party,RRR Success,Dil Raju Special party to RRR Team,Dil Raju,Ram Charan,Jr NTR,SS Rajamouli,Anil Ravipudi

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న విజువల్ వండర్“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.”ఆర్ఆర్ఆర్”మూవీ నైజాంలో దిల్ రాజు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నైజాంలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో “ఆర్ఆర్ఆర్”మూవీ టీమ్‌కి దిల్ రాజు సక్సెస్ పార్టీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ ఆర్ ఆర్” మూవీ లో నాటు నాటు సాంగ్ కు హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దిల్ రాజు సక్సెస్ పార్టీ లో దర్శకుడు రాజమౌళి , దర్శకుడు అనిల్‌ రావిపూడితో కలిసి నాటు నాటుసాంగ్ కు స్టెప్స్ వేశారు. వీరిద్దరూ స్టెప్స్ వేస్తుండటంతో అక్కడ పార్టీకి వచ్చిన వారంతా అరుస్తూ, విజిల్స్ వేస్తూ హంగామా చేశారు. అనిల్ రావిపూడి, రాజమౌళి కలిసి వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =