ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూశారో చూశాం. ఇక మొత్తానికి ఈసినిమా మార్చి 25న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా వస్తే ఎలా ఉంటుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ముందుగా అనుకుంటున్నట్టే.. ఈసినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా రోజురోజుకూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇంకా రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. ఇక ఇదే జోష్ లో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఈసినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా బిగ్ హిట్ అవుతుందని నేను ముందే ఎక్స్ పెక్ట్ చేశా కానీ నెంబర్ వన్ ట్యాగ్ వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.. నిజంగా ఇది మాకు సర్ప్రైజ్ లాంటిది.. మాకు మాత్రమే కాదు రాజమౌళి కూడా అదే ఫీల్ అవుతున్నారు అని తెలిపాడు.
షూట్ చేసేముందు చాలా వర్క్ షాప్ నిర్వహించారా..?. బాల్యం నుండి యుక్త వయసు వరకూ ప్రతి ఒక్క చిన్న డీటైల్ ను రాజమౌళి వివరించారు. ఉదాహరణకు అల్లూరి సీతారామ రాజు బాగా చదివాడు, యోగి మరియు విలువిద్యలో కూడా రాణించాడు. సినిమా ప్రారంభించేటప్పటికే ఈ ఎలిమెంట్స్ అన్నీ నాలో ఇమిడి ఉన్నాయి.. అయితే విజువల్ గా ఫస్ట్ సీన్ నుండి చూపించలేదు. అది చాలా ఛాలెంజింగ్ పార్ట్.. ఎందుకంటే ఆ పాత్రలో కొంత వరకూ మాత్రమే ఎమోషన్ చూపించగలగాలి.. అయితే మెడిటేషన్ నా పాత్రకు చాలా హెల్ప్ అయింది.. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడంలో చాలా హెల్ప్ అయింది అని తెలిపాడు.
నా మిత్రుడు తారక్‌తో కలిసి పనిచేయడం అలానే భారతదేశంలోని బెస్ట్ డైరెక్టర్ డైరెక్షన్‌లో సక్సెస్ సాధించడం ఇది ఏ నటుడికైనా ఇది బెస్ట్. నాలాంటి వాళ్లు ఎవరైనా కోరుకునేది కూడా అదే. నాకు తెలుసు మా మధ్య పోటీ వాతావరణం ఉంటుందని అంటుంటారు.. కానీ మేము ఆర్ఆర్ఆర్ కంటే ముందే స్నేహితులం.
ఆచార్య సినిమాతో నా డ్రీమ్ నిజమైంది.. నేను ఈసినిమా నుండి చాలా నేర్చుకున్నాను. నేను నిజానికి ఈసినిమా సెట్ లోకి ఒక కో స్టార్ గా అడుగుపెట్టలేదు.. ఒక స్టూడెంట్ గానే అడుగుపెట్టాను.. అలానే నాన్నగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను ఎప్పుడూ నేను ఎలా చేయాలో చేయి పట్టుకొని చేయించలేదు.. జస్ట్ నాపాత్రలో నేను సహజంగా చేసుకుంటూ వెళ్లనిచ్చేవారు.. ఏదైనా తప్పులు చేసినా చూసే వారు.. వేరే టేక్ చేయించేవారు.. ఎప్పుడూ తన కూల్ నెస్ ను మాత్రం వదిలిపెట్టేవారు కాదు..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: