తమిళ్ హీరోలు ఇప్పుడు అందరూ తెలుగులో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫలితాల సంగతి పక్కన పెడితే తెలుగులో కూడా తమ మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు ఆర్యన్ కూడా కెప్టెన్ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. ఆర్యన్ తెలగు ప్రేక్షకులకు సుపరిచితుడే. బన్నీ వరుడు సినిమాతో తెలుగులో ప్రతినాయక పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్. అయితే ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు. అయితే రాజా రాణి డబ్బింగ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడప్పుడు తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేదు. ఇక రీసెంట్ గా ఎనిమి సినిమా రిలీజ్ అయినా ఈసినిమా కూడా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the first look of #Captain.
Wishing the team a great success 👍👍@ShaktiRajan @arya_offl @SimranbaggaOffc @AishuLekshmi @immancomposer @madhankarky @tkishore555 @NxgenMedia @gopiprasannaa @DoneChannel1 @ThinkStudiosInd @thinkmusicindia #TheShowPeople pic.twitter.com/yuE3KGkaPb— Rana Daggubati (@RanaDaggubati) April 4, 2022
ఇక ఇప్పుడు శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్యన్ ప్రధాన పాత్రలో కెప్టెన్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ఆర్యన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మరి ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో డిఫరెంట్ థీమ్ తోనే ఆర్యన్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో సిమ్రాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. థింక్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: