పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చేస్తున్నాడు మహేష్. బ్యాంకింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు, బ్లాస్టర్, రెండు పాటలు రిలీజ్ చేయగా అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఈసినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు మ్యూజిక్ సన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థమన్ రేంజ్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ఆయన చేసిన పాటలు, బ్యాక గ్రౌండ్ స్కోర్ తోనే సినిమాకు సగం హైప్ వచ్చేస్తుంది. ఈసినిమాకు కూడా ఫస్ట్ సింగిల్ తోనే హైప్ ను పెంచేశాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయినా కళావతి సాంగ్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చాడు థమన్. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తన ఇన్ట్సా ద్వారా తెలిపాడు. మరి ఈమధ్య థమన్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన సినిమాలు అన్నీ ఎంత ఇంపాక్ట్ చూపించాయో చూస్తున్నాం. ఇక ఈసినిమా కు కూడా థమన్ సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ అందిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే 12న మూవీని రీలీజ్ చేయనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: