పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. నా లైఫ్ లో ఆదిపురుష్ సెంటిమెంటల్ గా నాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని తెలిపాడు. లక్కీగా ఓం రౌత్ లాంటి డైరెక్టర్ దొరికాడు..సినిమా మొదలయ్యాక మూడు రోజుల తర్వాత నేనిది చేయొచ్చా..? అని డైరెక్టర్‌ను అడిగాను. ఎందుకంటే నేనేదైనా తప్పు చేస్తే అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు ప్రభాస్.
ఆది పురుష్ సినిమా కాదు.. చాలా ప్రాముఖ్యత ఉన్న కథ. ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆదిపురుష్ గురించి చాలా భయపడ్డాను. ఆదిపురుష్ నాకు సినిమా కంటే ఎక్కువ అని తెలిపాడు.
ఇంకా బాక్సాఫీస్ నంబర్స్ గురించి మాట్లాడుతూ.. నాకు ప్రతిసారి బాహుబలి లాంటి సినిమాలు రావలంటే రావు.. బాక్సాపీస్ రికార్డుల విషయం కాదు..బడ్జెట్, ప్రజల అంగీకారం చాలా ముఖ్యం అని అన్నాడు. నేను ప్రతి ప్రాంతానికి ఏ స్థాయిలో చేరుకుంటున్నా..ఎంత మంది ప్రజలు నిరాశ చెందుతున్నారు..సంతోషంగా ఉంటున్నారు..లేదా సూపర్ ఎక్జయిట్ అవుతున్నారనేది బాక్సాపీస్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతా..ఇది చాలా ముఖ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: