దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా ఈ నెల 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్లలో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 500కోట్లకు పైగా వసూలు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఈసినిమాపై అలియా భట్ అసంతృప్తిగా ఉందని వార్తలు వచ్చాయి. దానికి తోడు రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ పోస్ట్ లను కూడా డిలీట్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. ఇక ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చింది అలియా. తన ఇన్ట్సాలో ఈమేరకు ఒక పోస్ట్ కూడా పెట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’టీమ్ పట్ల నేను అసంతృప్తిగా ఉన్నానని, పాత పోస్టులను కూడా డిలీట్ చేశానని నాపై పుకార్లు వచ్చాయి. దయచేసి ఇలాంటి తప్పుడు విషయాలను ప్రచారం చేయకండి. నేను ప్రతిసారి నా ఇన్‌స్టాలోని పాత పోస్టులను డిలీట్ చేస్తుంటా.. అందులో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్ పోస్టులను తీసేనా.. తప్పుడు విషయాలను ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ‘ఆర్‌ఆర్‌ఆర్’లాంటి గొప్ప చిత్రంలో పాలుపంచుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సీత పాత్రని చాలా ప్రేమతో చేశాను. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆర్‌ఆర్‌ఆర్ సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే.. రాజమౌళితో పాటు ఆయన టీమ్ అంతా ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారు. వారి శక్తినంతా ధారబోసి ఓ మంచి చిత్రాన్ని అందించారు. ఇలాంటి గొప్ప చిత్రం పట్ల తప్పుడు విషయాలను ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను’ అంటూ ఆలియా చెప్పుకొచ్చింది. మరి ఇప్పటికైనా రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం..
Actress #AliaBhatt sheds light on the rumours floating around on social media.@aliaa08 #RRRMovie #TeluguFilmNagar pic.twitter.com/CxjLfibLdM
— Telugu FilmNagar (@telugufilmnagar) March 31, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: