వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక వాటిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ ఈసినిమాలో చేయనున్నాడు.
ఈసినిమా అయితే ఇప్పటివరకూ లాంచ్ కాలేదు. అయితే ఈసినిమాకు సంబంధించిన వరుస అప్ డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాను ఉగాది పండుగ రోజు సందర్భంగా గ్రాండ్ లాంచ్ చేయనున్నారు. అంతేకాదు అదే రోజున ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. బాలీవుడ్ నటి నూపుర్ సనన్ ను ఈసినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. నూపుర్ సనన్ కృతి సనన్ కు సోదరి అన్నసంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1970వ కాలంలో పలు సంచనాలు సృష్టించిన స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న సినిమా ఇది. ఇక ఈసినిమాకోసం రవితేజ తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ అన్నీ పూర్తిగా మార్చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అభిషేక్ అగర్వాల్ తన హోమ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లో ఈసినిమాను తెరకెక్కించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: