భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్, అలానే ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ అయిపోగా.. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ సినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరో రెండు వారాల్లో ఈసినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను కొల్లగొట్టింది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇక తాజాగా ఈసినిమా 2 సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చారు సెన్సార్ బృందం. ఈ రన్ టైమ్ కూడా లాక్ అయిపోయింది. ఈ సినిమా వ్యవధి 2 గంటల 48 నిమిషాలుగా ఖరారైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: