బ్లాక్ బస్టర్ “సింహా ” మూవీ తరువాత సక్సెస్ ఫుల్ బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “లెజెండ్ ” మూవీ 2014 మార్ఛి 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. ఒక కీలక పాత్రలో జగపతి బాబు నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన “లెజెండ్” మూవీ లో బాలకృష్ణ పెర్ఫార్మన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్ లో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించింది. పంచ్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో దర్శకుడు బోయపాటి “లెజెండ్” మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ తో 31 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న “లెజెండ్” మూవీ కడప జిల్లా ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో 1000 రోజులు ప్రదర్శించబడటం విశేషం. హీరో బాలకృష్ణ కెరీర్ లో అద్భుత చిత్రం గా నిలిచిన “లెజెండ్” మూవీ 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: