మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘గని’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో మనకు కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి పాటలు, టీజర్, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. ఇక ఈప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న గ్రాండ్‌గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Icon St𝔸𝔸r @alluarjun garu to grace the grand pre-release event of #Ghani 🥊 on April 2nd @ Vizag! 💥⚡#GhaniFromApril8th 👊@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @shreyasgroup pic.twitter.com/ktTiYlZeff
— GA2 Pictures (@GA2Official) March 29, 2022
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా నదియా, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: