బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో సంచలనానికి సిద్దమవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడం అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి అప్పుడే మొదలైపోయింది. మరోపక్క రాజమౌళి, ఎన్టీఆర్, రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్నారు. ఇప్పటీకే సుమ, అనిల్ రావిపూడి వంటి వారికి ఇంటర్వూస్ ఇచ్చిన రాజమౌళి..తాజాగా అర్జున్ రెడ్డి సందీప్ వంగ తో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. మీరు కూడా ఆ ఇంటర్వ్యూ పై లుక్ వేయండి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎప్పుడూ రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో మీ సినిమాలు ఉండటానికి కారణం..?
రివేంజ్ అనేది స్ట్రాంగెస్ట్ ఎమోషన్.. నిజానికి ఇదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు.. ఏదన్నా ప్లాట్ పాయింట్ విన్నప్పుడు ఇది బావుంది కదా.. దీనిమీద వర్క్ చేస్తే బాగుంటది కదా అనుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళిపోతాను.. అయితే కొన్ని సినిమాల తర్వాత చూస్తే రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో వెళుతున్నాను అన్న విషయం అర్థమైంది. అంతేకాకుండా రివేంజ్ స్ట్రాంగ్ ఎమోషన్.. చాలా ఈజీగా అండ్ స్ట్రాంగ్ గా కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి ఎక్కువ సినిమాలు అలానే వచ్చాయి.
ఎన్టీఆర్-పులి షాట్
నేను తారక్ కు చెప్పినప్పుడు ఈసీన్ లో భయం ఉండాలని చెప్పాను.. అయితే పులిని చూసి భయపడటం కాదు .. ఒక పనికి వెళుతున్నప్పుడు జరగాల్సిన పని అవుతుందా లేదా అన్నది చూపించాలి అన్న పాయింట్ ను ఎన్టీఆర్ కు చెప్పాను.. కానీ ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టర్ కాబట్టి చేసేశాడు. నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు చెప్పాను..తనకు సంవత్సరం ముందు చెప్పినా కూడా ప్రతి విషయం గుర్తుంటుంది. నేను కూడా ప్రతి చిన్న విషయం ఏం చెప్పను.. ఓవరాల్ గా నాకేం కావాలో.. అక్కడ ఏం జరుగుతుందో చెబుతాను అంతే. ఇంక వాళ్లు చేసేస్తారు.
రూత్ లెస్ పోలీస్ గా రామ్ చరణ్
ఫైట్ మాస్టర్ సొలొమాన్ కు ఫైట్ సీక్వెన్స్ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ముందు నేను సొలొమాన్ కు చెప్పినా కూడా తను చేయడేమో అని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో చేపించాలి అనుకున్నా కానీ తను పంపించిన ఎగ్జాంపుల్స్ నచ్చలేదు. ఏం చేద్దామా అనిఆలోచిస్తున్న సమయంలో సొలొమాన్ తను చేసిన సీక్వెన్స్ ను చూపించాడు. నాకు చాలా బాగా నచ్చేసింది. కొన్ని కరెక్షన్స్ చేసి ఈ సీక్వెన్స్ ను తీశాం. రెండున్నర నెలలపాటు ఈ సీక్వెన్స్ ను తీశాడు. ముందు కొంత మంది ఆ తరువాత కొంతమంది అలా 2000 మందితో చేశాడు. ప్రతి చిన్న బిట్ కూడా కొరియోగ్రఫి చేసిందే. చరణ్ కూడా రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా చేశాడు. తను కొడుతున్నప్పుడు కూడా జనాల్నీ చూడడు.. తన బాడీ మూమెంట్ చాలా వైలెంట్ గా.. ఫేస్ చాలా సైలెంట్ గా.. లుక్ ఇంటెన్స్ గా ఉంటుంది. ఈ సీక్వెన్స్ మొత్తం థియేటర్లలో చూస్తే ఖచ్చితంగా నచ్చేస్తుంది.
నాటు నాటు సాంగ్ రీజన్
కమర్షియల్ గా వారిద్దరూ మంచి డాన్సర్స్ అని మనందరికీ తెలుసు.. ఎలాగూ మంచి డాన్స్ నెంబర్ ఉండాలనుకున్నాం.. అయితే దానికి కూడా ఒక పర్పస్ ఉండాలి అనుకున్నాం.. అలాగే వారిద్దరి మధ్య మంచి సింక్ ఉంది అని చెప్పడానికి ఈ సాంగ్ ను యూజ్ చేసుకున్నాం. దానితో సాంగ్ లో ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది.. అది కూడా ఒక చిన్న కథలాగే ఉంటుంది.. సాంగ్ కు బిగినింగ్.. ఎండింగ్ ఒక స్టోరీలాగా ఉంటుంది. వాళ్లు అంత పర్ఫెక్ట్ గా సింక్ చేస్తున్నప్పుడు తరువాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా అలానే సింక్ లో చేసేస్తారు అన్న థాట్ అందరిలో ఉంటుందని చేశాం.
సినిమా షూటింగ్
దాదాపు 300 పైగా రోజులు పట్టింది. ఈసినిమాను 250 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాం కానీ ఒక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ కే దాదాపు 65 నైట్స్ పట్టింది. నిజానికి ఈసీక్వెల్ ను 28 డేస్ లో పూర్తి చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. రిహార్సల్ షూటింగ్ కు మరో 200 పైగా రోజులు ఉంటుంది. మధ్యలో కరోనా వల్ల కొన్ని రోజులు టైమ్ వేస్ట్ అయింది.
హీరోలు వాళ్లే.. హీరోహీరోయిన్లు వాళ్లిద్దరే..!
ఈసినిమాలో చరణ్ ఇంకా అలియా మధ్య చిన్న లవ్ యాంగిల్ ఉంటుంది.. కానీ రొమాంటిక్ ట్రాక్ లాగ మాత్రం లేదు. అసలు సాంగ్స్ సంగతి పక్కన పెడితే అసలైన రొమాంటిక్ యాంగిల్ ఎన్టీఆర్-చరణ్ మధ్యనే ఉంటుంది. అంటే ఈసినిమా లో హీరోలు వాళ్లిద్దరే.. హీరో హీరోయిన్లు వాళ్లిద్దరే.. హీరో విలన్ వాళ్లిద్దరే ఎవ్రిథింగ్ వాళ్లిద్దరే..
ఈ సినిమాలో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.