నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇన్ని రోజులు రిలీజ్ డేట్ ను అయితే చెప్పకుండానే పనులు కానిచ్చేశారు చిత్రయూనిట్ మరోపక్క అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ముందుగా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పాట అరబిక్ కుతు విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల క్రితమే ‘జాలీ ఓ జింఖానా’ అనే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#BeastFromApril13@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #Beast pic.twitter.com/htH6dTPX2q
— Sun Pictures (@sunpictures) March 22, 2022
ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఏప్రిల్ 14న ఎంతో మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా కె.జి.యఫ్ 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా దానికంటే ఒక రోజు ముందు రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోరుకు దిగారు. మరి ఆ పోటీ ఎలా ఉంటుంది.. ఏ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుందో చూడాలి.
కాాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా.. యోగిబాబు మరో కీలకపాత్రలలో నటిస్తున్నాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: