చైతు @7 మిలియన్..!

7 Million Followers for Naga Chaitanya on Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Naga Chaitanya,Naga Chaitanya Telugu Movies,Naga Chaitanya Movie Updates,Naga Chaitanya latest Updates,Naga Chaitanya Movie Updates,Naga Chaitanya upcoming Movies, Naga Chaitanya latest News,Naga Chaitanya Instagram,Naga Chaitanya 7 Million Followers in Instagram,Instagram Followers for Naga Chaitanya Crossed 7 Millions, Naga Chaitanya Thankyou Movie Updates,Naga Chaitanya in Webseries,Naga Chaitanya in Hindi Webseries,Thank You romantic comedy film,Thank You movie written by B. V. S. Ravi, Thank You Movie Directed by Vikram Kumar,Thnak You Movie produced by Dil Raju under his banner Sri Venkateswara Creations,Raashi Khanna with Naga Chaitanya in Thank You Movie, Thaman S Music Composer For Movie Thank You,Naga Chaitanya in Dootha Webseries,#ThankyouMovie,#Nagachaitanya,#Nagachaitanyainstagram

సోషల్ మీడియా అనేది ఇప్పుడు సినిమాల ప్రచారాలకు పెద్ద వేదికగా మారిన సంగతి తెలిసిందే కదా. తమ సినిమాలకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఇవ్వాలనుకుంటే సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటే చాలు అందరికీ తెలిసిపోయినట్టే. ఇక సోషల్ మీడియా రికార్డులు కూడా ఇప్పుడు నడుస్తున్న ట్రెండే. ఎన్ని మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటే అంత క్రేజ్ వచ్చినట్టు.. అలానే అంత గ్రేట్ అన్నట్టు కూడా. ఇక కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు హీరోల సోషల్ మీడియా అకౌంట్లు, వారి చేసే పోస్టులు, ముఖ్యంగా ఫాలోవర్లకు కూడా ఒక లెక్క ఉంటుంది. హీరోల ఫాలోవర్ల ను బట్టి కూడా రికార్డులు ఉంటాయి. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మిలియన్లలో ఫాలోవర్లను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా యంగ్ హీరో నాగచైతన్య కూడా మరో మైల్ స్టోన్ ను దాటాడు. తాజాగా తన ఇన్స్టా ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్లకు చేరడంతో సరికొత్త మైల్ స్టోన్ ను సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చైతు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లోనే ఉన్నాడు. గత ఏడాది లవ్ స్టోరీతో హిట్ కొట్టిన నాగ చైతన్య రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా దీనితో పాటు దూత అనే వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ను కూడా విక్రమ్ కుమారే డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈవెబ్ సిరీస్ కూడా షూటింగ్ దశలో ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − twelve =