కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాను రిలీజ్ చేసే 1000కి పైగా థియేటర్లలో ‘గని’ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.
#GhaniTrailer to be screened in 1000+ screens across South India with #RRRMovie by @qubecinema
ICYMI – https://t.co/OkQ2rOstBn
In Theatres #GhaniFromApril8th 👊#Ghani 🥊 @IAmVarunTej @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/tps5qs5ITF
— Geetha Arts (@GeethaArts) March 22, 2022
కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో రూపొందించిన భారీ మల్టిస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.