గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందన్న వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. గౌతమ్ రామ్ చరణ్ కు కథ వినిపించాడని.. చరణ్ కు కూడా కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడన్న కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో గౌతమ్ ఖండించాడు కూడా. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి వీరిద్దరి సినిమా రావడం దాదాపు ఖరారే కానీ అధికారిక ప్రకటన రావాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తన్నారు. అసలు సంగతేంటంటే తాజాగా ఒక నెటిజన్ దీనిపై సోషల్ మీడియా వేదికగా గౌతమ్ తిన్ననూరిని అన్నా చరణ్ అన్నతో మంచి సినిమా తీయన్నా.. క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి అంటూ కామెంట్ పెట్టగా దానికి గౌతమ్ తన బెస్ట్ వర్క్ ని ఈ సినిమాకి అందిస్తానని చరణ్ తో సినిమా నా డ్రీం అని కూడా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Will try my best and do everything possible, this is my dream too 😊
— gowtam tinnanuri (@gowtam19) March 17, 2022
ఇక జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్. ఈసినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. జెర్సీ సినిమా హిందీలో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక హిందీలో కూడా గౌతమే దర్శకత్వం వహించనున్నాడు. హిందీ వర్షన్ ను టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. సూపర్ 30, బాట్ల హౌస్ సినిమాల్లో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: