టాలీవుడ్ లో యంగ్ హీరోల జోరుగా మాములుగా లేదు. ఒక్కొక్కరూ కనీసం రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నారు. ఇక ఆ లిస్ట్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా వస్తాడు.
యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గానే గల్లీరౌడీ లాంటి కామెడీ ఎంటర్ టైనర్ తో అలరించిన సందీప్ కిషన్ ప్రస్తుతం మైఖేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో ఇప్పుడు మరో యంగ్ హీరో చోటు దక్కించుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ కెరీర్ మొదట్లో మంచి సినిమాలే చేశాడు. అయితే తరువాత సరైన కథలు ఎంచుకోకపోవడం.. కొత్త కొత్త హీరోలు కూడా రావడంతో అవకాశాలు తగ్గాయి. చాలా ఏళ్లు స్క్రీన్ పై కనిపించలేదు కూడా. ఆ తరువాత బిగ్ బాస్ 3లో సందడి చేసి మరోసారి అందరికీ నోటెడ్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. రీసెంట్ గానే ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈసినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. చిత్రయూనిట్ ఈ విషయాన్ని నేడు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేసింది.
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మజిలీ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఈసినిమాలో సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: