కరోనా ముందు సినిమా రిలీజ్ అయిన తరువాత ఓటీటీ లోకి రావాలంటే చాలా టైమ్ పట్టేది. కానీ కరోనా వల్ల పరిస్థితులు చాలా మారిపోయాయి. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా అదే బాట పడుతున్నాయి. అఖండ, పుష్ప లాంటి సినిమాలు బాక్సాఫీస్ బద్దలుకొట్టినా చాలా తక్కువ రోజులకే ఓటీటీలోకి వచ్చేశాయి. వీటితో పాటు చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుండగా ఇప్పుడు రవితేజ ఖిలాడి కూడా చేరిపోయింది. ఈసినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అయితే రవితేజ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కు కూడా సిద్దమవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈసినిమాతో పాటు ధమాకా సినిమా అలానే రావణాసుర సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరి ఖిలాడి ఇప్పటికే రాగ ఈ ఏడాది మరో రెండు సినిమాలు అయినా రవితేజ రిలీజ్ చేసేలా కనిపిస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: