ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నిన్న (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేమకీ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై చివరి రోజుల్లో మంచి బజ్ నే క్రియేట్ చేశారు మేకర్స్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచేసింది. దీంతో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ సినిమా కాబట్టి ఈసినిమాకు ముందే బుకింగ్స్ సాలిడ్ గా జరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టినట్టు తెలుస్తుంది. పెద్ద సినిమా కాబట్టి ప్రభుత్వాలు కూడా నిబంధనల్లో కాస్త వెసలుబాటు ఇస్తారు. ఐదు షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం.. ఇక ఎప్పటినుండో ఏపీలో టికెట్ల రేటుపై వివాదం ఉన్నా కూడా ఈసినిమాకు టికెట్ల రేటు పెంచుకునే అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా చిత్రయూనిట్ కూడా ఈవిషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. మొదటి రోజే ఈసినిమా దాదాపు 79 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా తెలియచేశారు. మరి ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా ఏం లేవు.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ఇంకా రెండు వారాల వరకూ టైమ్ ఉంది.. ఈ గ్యాప్ లో రాధేశ్యామ్ సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు.
#RadheShyam ruling the Boxoffice🎞️🎟️, thankyou for making the Highest Grosser film Post Pandemic with 79cr!#BlockBusterRadheShyam ❤
Book your tickets now on @paytmtickets!https://t.co/Dr28SLfkza#Prabhas @hegdepooja @director_radhaa pic.twitter.com/nVcpOfGURi
— UV Creations (@UV_Creations) March 12, 2022
కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించగా.. భాగ్యశ్రీ, కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. జస్టిన్ ప్రభాకరన్ సౌత్ వర్షన్స్ కు పాటలు అందించగా.. హిందీలో మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ అందించాడ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: