పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజా హెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్” మూవీ మార్చి 11 రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో డాక్టర్ ప్రేరణ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పూజాహెగ్డే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే క్యాజువల్ లుక్ లో ఉన్న ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా , ఆ క్యుట్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: