మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో గానం చేసిన, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఊ అంటావా.. ఊఊ అంటావా” స్పెషల్ సాంగ్ విమర్శలు ఎదుర్కొన్నా విడుదలైన 20 రోజుల్లోనే అన్ని భాషలలో 100ప్లస్ మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘పుష్ప’ సినిమాలో తను చేసిన స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా”పై సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఈ సినిమా విడుదల తర్వాత ఈ పాట విషయంలో తను హ్యాపీగా ఉన్నట్లుగా తెలిపిన సమంత ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ…”పుష్ప” సినిమాలో తాను నటించిన “ఊ అంటావా మావా” సాంగ్‌కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదనీ , దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందనీ , తాను ఈ పాటను కేవలం తెలుగు పాటగానే భావించాననీ , కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటకి క్రేజ్ వచ్చిందనీ , తాను ఎక్కడికి వెళ్లినా “ఊ అంటావా మావా” పాటలో తాను బాగా చేశానని చెబుతున్నారనీ , అలా చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: