కరోనా మహమ్మారి కారణం గా చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. “లవ్ స్టోరి”, అఖండ “, “పుష్ప :ది రైజ్ “, “శ్యామ్ సింగ రాయ్“, “డీజే టిల్లు ” వంటి మూవీస్ ఘనవిజయం సాధించడంతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి. పలు భారీ బడ్జెట్ మూవీస్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రేక్షకులకు వినోదం చవకగా అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరలు సవరిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.సరిగ్గా ఏడాది కిందట ఇది ఊహించని పరిణామం. కొత్త టిక్కెట్ ధరలతో తమ పెట్టుబడులను రికవరీ చేయలేక రాష్ట్రంలోని అనేక థియేటర్లు మూతపడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ టికెట్ ధరలు వర్క్ అవుట్ కాకపోవడంతో టాలీవుడ్ హీరోలు సి ఎం జగన్ తో టికెట్ రేట్స్ , స్పెషల్ షో లకై చర్చలు జరిపారు. చర్చల తరువాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి పెంచిన టికెట్ రేట్స్ తో కొత్త జీవో విడుదల చేసింది. కొత్త జీవో ప్రకారం టికెట్ గరిష్ఠ ధర రూ.250 కాగా.. కనిష్ఠ ధర రూ.20 గా ఉంది. దీనిపై అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. మున్సిపాలిటీ లలో నాన్ ఏసీ కనిష్ఠ ధర రూ.30 కాగా.. ఏసీ కనిష్ఠ ధర రూ.60గా ఉంది. కార్పొరేషన్ లలో నాన్ ఏసీ కనిష్ఠ ధర రూ.40 కాగా.. ఏసీ కనిష్ఠ ధర రూ.70 గా ఉంది. నగర పంచాయితీల్లో నాన్ ఏసీ కనిష్ఠ ధర రూ.20 కాగా ఏసీ కనిష్ఠ ధర రూ.50 గా ఉంది. సవరించిన టికెట్ ధరలపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: