‘కబ్జ’.. శ్రియ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Shriya Saran First Look from Kabzaa Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Kabzaa,Kabzaa Movie,Kabzaa Movie Updates,Kabzaa Movie Latest News,Kabzaa Upcoming Movie in 2022,Actress Shriya saran,Shriya Saran New Movie Kabzaa, Shriya Saran in Kabzaa Movie,Shriya Saran First Look,Shriya Saran First look Released From Kabzaa Movie,Shriya Saran to Play a key role in Kabzaa Movie, shirya saran with Kannada super Hero Upendra,Upendra Upcoming Movie Kabzaa,Kannada Hero Upendra Upcoming Movie Kabzaa,Kiccha Sudeep Upcoming Movie Kabzaa, Sudeep Movie Updates,Sudeep latest News,Sudeep in Kabzaa Movie,Sudeep Upcoming Movie Kabzaa,Kabzaa latest Movie Updates,Kabzaa Pan India Movie,#Kabzaa

ఒకప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో మెప్పించింది శ్రియ సరన్. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఇక వివాహం అనంతరం కాస్త సినిమాలను తగ్గించినా ఈమధ్య పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అయితే దక్కించుకుంటుంది. త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది శ్రియ. ఇక ఇప్పుడు మరో సినిమాలో మరో అవకాశం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కబ్జ. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ప్రారంభించింది అయినా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఉపేంద్ర ఇంకా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న సుదీప్ కు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేయగా అవి ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమాలో శ్రియా కూడా మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక తాజాగా శ్రియకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రియా మధుమతి పాత్రలో నటిస్తుంది. మ‌హారాణి గెట‌ప్‌లో ఉన్న శ్రియ లుక్ ఆకట్టుకుంటుంది.

కాగా 1970బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను కన్నడ , తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 20 =