టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాదు చిన్న సినిమాలకు కూడా థమన్ సాయం చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న డీజే టిల్లు సినిమాకు థమనే బ్యాక్ గ్రౌండ్ అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమా కూడా థమన్ ను తమ ప్రాజెక్ట్ లో జాయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇప్పటికే ఈసినిమా కోసం నార్త్ కు వేరే, సౌత్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అయినా కూడా ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం స్పెషల్ గా థమన్ ను తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. థమన్ పై ఎంత నమ్మకం ఉందో. ఈసినిమా తెలుగు వర్షన్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయితే తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రభాస్ కూడా థమన్ గురించి మాట్లాడుతూ.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈసినిమాను ఒక్కసారి పైకి లేపారని నా వ్యక్తిగత అభిప్రాయం.. థమన్ బీజియం అందరికీ నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఖచ్చితంగా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్.ఇంకా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: