సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లో హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ హీరో అనిపించుకుంటున్నారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే పలువురు చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేశ్ తాజాగా “ప్యూర్ లిటిల్ హార్ట్స్'” ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆయన ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడి వారి తల్లిదండ్రుల పాలిట దైవంగా నిలిచారు.మహేశ్ బాబుపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ప్రముఖ సీనియర్ నటి, ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి., సూపర్ స్టార్ మహేశ్ బాబును పొగడ్తలతో ముంచేశారు. చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నాను” అంటూ సోషల్ మీడియా ద్వారా రోజా ప్రశంసించారు. మహేష్ బాబు ప్రస్తుతం ” సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ మూవీ మే 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: