ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ పైనే దృష్టి పెడుతున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలు కూడా కొంత మంది హీరోలకు మాత్రమే కలిసొస్తాయని ఇప్పటికే చూశాం. కానీ ప్రభాస్ మార్కెట్ మాత్రం డిఫరెంట్. తను ఇప్పుడు చిన్న సినిమా తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పాన్ ఇండియా సినిమాలే. మూడు రోజుల్లో రిలీజ్ అవ్వబోయే రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే ఇలా అన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.. ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇలాంటి నేపథ్యంలో గత కొద్ది కాలంగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ వార్తలపై ఇటీవల మారుతి కూాడా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు కూడా. అయితే అప్పుడు ఆ వార్తలను మారుతి అయితే ఖండించలేదు కానీ.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి అని మాత్రం చెప్పి సందిగ్దంలో పడేశారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం నిజమే అన్న క్లారిటీ వస్తుంది. దానికి కారణం ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలా దేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ తను ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడని.. ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.. ఇంకా మారుతి, డీవీవీ దానయ్య గారి సినిమా కూడా చేస్తున్నాడని చెప్పారు. మరి దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.
కాగా మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు మారుతి. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: