పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు హరీష్ శంకర్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈసినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా హరీష్ శంకర్ కూడా ఈసినిమాపై బాగానే హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఫొటో చూస్తూంటే భీమ్లానాయక్ సెట్ అని తెలుస్తుండగా.. ఇద్దరూ ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఇక ఈఫొటో పోస్ట్ చేస్తూ.. ఈ ఫొటో గుర్తు పెట్టుకోండి.. ఇద్దరం దేని గురించి మాట్లాడుతున్నామో సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ హామీ ఇచ్చారు.
View this post on Instagram
కాగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: