ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏది వస్తే ఆపాత్ర కాకుండా.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తన అందం, అభినయం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈసినిమా మార్చి 4న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈవెంట్ కు సుకుమర్ తో పాటు సాయిపల్లవి, కీర్తి సురేష్ కూడా ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ సాయిపల్లవి పై ప్రశంసలు కురిపించాడు. సుకుమార్ స్పీచ్ లో భాగంగా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ సాయి పల్లవి పేరు చెప్పగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా అరుపులతో స్డేడియంను హోరెత్తించగా.. దానిపై సుకుమార్ స్పందిస్తూ సాయి పల్లవి క్రేజ్ చూస్తుంటే ఆమె ఒక లేడీ పవన్ కల్యాణ్ లా కనిపిస్తుందని అన్నాడు. అంతేకాదు..
బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రకటనల్లో ఆఫర్ వస్తే తిరస్కరించడం అందరికీ సాధ్యం కాదు. ఈ వృత్తిలో అలా ఉండటం చాలా గొప్ప విషయం. ఈ విషయం ఆమెతో వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నా. కానీ ఇప్పుడా అవకాశం వచ్చింది..అంటూ సాయిపల్లవిపై పొగడ్తల వర్షం కురిపించాడు.
కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఖుష్బూ సుందర్, ఊర్వశి, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: