సూపర్ హిట్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. దీపిక ప్రస్తుతం బాలీవుడ్ మూవీ “పఠాన్” లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది. ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ సినిమా ‘ద్రౌపది’ని తెరకెక్కించాలని దీపిక ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. దీపిక మెయిన్ లీడ్ లో “ద్రౌపది” మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో దీపిక మాట్లాడుతూ .. తన డ్రీం ప్రాజెక్ట్ “ద్రౌపది” త్వరలోనే తెరకెక్కనుందనీ , ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పడుతుందనీ , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: