ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ మార్చి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బు , రాధికా , ఊర్వశి , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆడవాళ్ళు మీకు జోహార్లు”మూవీ మార్చి 4న విడుదల కానున్న సందర్భంగా సీనియర్ నటి కుష్బూ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినపుడే తనకు చాలా కొత్తగా అనిపించిందనీ , అన్నిరకాల భావోద్వేగాలను మిళితం చేశారనీ , టైటిల్ కూడా చాలా బాగా నచ్చేసిందనీ , అందుకే వెంటనే ఒప్పుకొన్నాననీ , రాధిక, ఊర్వశి… వీరిద్దరూ చాలా గొప్ప నటీమణులనీ , వాళ్లతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అనీ , ఇంతమంది ఆడవాళ్లు ఓ సినిమాలో ఉండడం ఈమధ్యకాలంలో ఇదేనేమోననీ , అందరికీ నచ్చేలా , కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ మూవీ ని దర్శకుడు తెరకెక్కించారనీ , తెలుగులో కొత్త కథలు వింటున్నాననీ , మనసుకు నచ్చిన పాత్రలు వస్తే, వరుసగా చేస్తూనే ఉంటాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: