సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
.@MusicThaman dances for the #Kalaavathi song along with #Sekhar master 💥💥
– https://t.co/sOMHdecO1m#SarkaruVaariPaata
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @saregamasouth pic.twitter.com/Dya8FuAfox
— 123telugu (@123telugu) February 22, 2022
సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.ఈ సాంగ్ లో మహేష్ బాబు , కీర్తి సురేష్ ల జంట క్యూట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళావతి సాంగ్ కు మహేష్ బాబు తనయ సితార , కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కళావతి’ పాటకు సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ సిగ్గుపడుతూ స్టెప్స్ వేశారు. ఈ పాటలో మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ని, డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి థమన్ చేశారు. ఆ డ్యాన్స్ చేస్తున్న వీడియోని థమన్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశారు. ఇప్పుడీ ఆ వీడియో వైరల్ అవుతోంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: