చాణిక్య చిన్న దర్శకత్వంలో తిృగున్, పూజిత పొన్నాడ జంటగా వస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి సినిమా మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో చిత్రయూనిట్ బిజీగా ఉండగా.. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వచ్చిన ఈసినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు..
Here’s the scintillating trailer of #KathaKanchikiManamIntiki out now on @telugufilmnagar!
▶️https://t.co/ehPNYunxKg#KKMITrailer@ActorThrigun @mpartsofficial @pujita_ponnada @chanakya_chinna @ceomonish @ceciroleo @iamkumarkota @getupsrinu3 @MangoMusicLabel pic.twitter.com/H45ZYcOurS
— Telugu FilmNagar (@telugufilmnagar) February 23, 2022
కాగా ఈసినిమాలో ఇంకా మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా ఈసినిమా తెరకెక్కుతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: