ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. ఇక పార్ట్1 సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ సీక్వెల్ పై అదే స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14నే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి అప్పుడప్పుడు పోస్టర్లు.. పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మళ్లీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ షురూ చేస్తూనే ఫ్యాన్స్ కు ఆప్షన్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ వేశారు. తాజాగా ఈసినిమా నిర్మాణ సంస్థ కూడా తమ ట్విట్టర్ ద్వారా నిరీక్షణ ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు… అయితే మేము కె.జి.యఫ్ ఫ్యాన్స్ ఆత్రుతను చూడాలనుకుంటున్నాము.. మీరు ఫస్ట్ ఏం చూడాలనుకుంటున్నారు.. ట్రైలర్, సాంగ్ లేదా మమ్మల్నే సర్ ప్రైజ్ చేయమంటారా అంటూ ఆప్షన్స్ ఇచ్చింది చిత్రయూనిట్. దీంతో ఫ్యాన్స్ తమకు నచ్చిన ఆప్షన్స్ ను కామెంట్ రూపంలో తెలియచేస్తున్నారు. మరి ఫైనల్ గా మేకర్స్ ఏం అప్ డేట్ ఇస్తారో చూడాలి.
We know the wait has been exasperating. But, we are very excited to see the eagerness of our beloved fans to get a glimpse of KGF: Chapter 2. What do you want to see first?
Let the KGF army decide the next move! #KGF2onApr14 #KGFChapter2— Hombale Films (@hombalefilms) February 23, 2022
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: