కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఆడవాళ్లదే రాజ్యం అన్న బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను అలానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. అందుకే అంత ధైర్యంగా ఈసినిమాను ఈనెల 25న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ప్రమోషన్ లో భాగంగానే ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈసినిమాలో సీనియర్ రాధిక, ఖుష్బూ, ఊర్వశి కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు. జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: