ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాల నుండి పలు అప్ డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది పోస్టర్లు రిలీజ్ చేస్తే కొంతమంది పాటలు రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ కొత్త సినిమా ది వారియర్ నుండి కూడా అప్ డేట్ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు కూడా పలుమార్లు బ్రేక్ పడగా ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. దీంతో ఈసినిమాలో కృతిశెట్టి విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తుంది. ఇక ట్రెండీ లుక్ తో కృతి శెట్టి ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తన కెరియర్లో ఫస్ట్ టైమ్ ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: