మాస్ మహారాజా రవితేజ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సినిమా విజయాల సంగతి పక్కన పెడితే ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. కోరనా వల్ల పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా గత ఏడాది క్రాక్ రిలీజ్ చేశాడు. ఇక రీసెంట్ గా ఖిలాడి సినిమాను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా రవితేజ ఇటీవలే రెండో షెడ్యూల్‌లో షూట్‌లో జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇక విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ వేదికగా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a Wrap for 2nd schedule 🔥#RAVANASURA Completes its 2nd Schedule in Hyderabad 🙌#RavanasuraOnSep30⚡️@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @fariaabdullah2 @ItsAnuEmmanuel @akash_megha @rameemusic @SrikanthVissa pic.twitter.com/LmpaeUlL8j
— RT Team Works (@RTTeamWorks) February 12, 2022
కాగా ఈసినిమాలో సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవితేజ లాయర్‌గా నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో రామ్‌గా కనిపించనున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మొత్తం ఐదుగురు హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ నటించనున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: