మాస్ మహారాజా రవితేజ ఎన్నో ఏళ్ల తర్వాత క్రాక్ సినిమాతో మంచి హిట్ ను కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హిట్ కొట్టడానికి ఖిలాడి సినిమాతో వచ్చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. మరి నేడు ఈసినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. రవితేజ మరో హిట్ ను సొంతం చేసుకున్నాడా?లేదా?అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ, అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ
డైరెక్టర్.. రమేష్ వర్మ
బ్యానర్స్..ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
నిర్మాతలు..కోనేరు సత్యనారాయణ
సంగీతం.. దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి.. సుజిత్ వాసుదేవ్
కథ
మనీ కంటెయినర్ ను మోహన్ గాంధీ(రవితేజ) దోచుకోవడంతో కథ స్టార్ట్ వుతుంది. గాంధీ హత్యానేరం కేసులో జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. ప్రియ (మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ డీజీపీ (సచిన్ ఖేడేకర్) అమ్మాయి. అతడు ఎందుకు హత్యలు చేశాడనే విషయాన్ని తెలుసుకోవడానికి సైకాలజీ స్టూడెంట్ మీనాక్షి చౌదరి ప్రయత్నిస్తూ ఉంటుంది. సిబిఐ కూడా ఇదే విషయమై వేటాడుతూ ఉంటుంది. ఈక్రమంలో ప్రియ కొంత మంది ముఠా సభ్యులు 10 వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో మెహన్ గాంధీని ఇరికించి అతని కుటుం సభ్యులను చంపేశారనే నిజం తెలుసుకుంటుంది. తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ బెయిన్ ఇప్పిస్తుంది. అయితే గాంధీ బయటకు వచ్చిన తరువాత అతని గురించి అసలు నిజం తెలుస్తుంది. మరోవైపు హోమ్ మినిస్టర్ (ముఖేశ్ రుషి) ని రాష్ట్రముఖ్యమంత్రి ని చేయటానికి ఉపయోగించవలసిన ఆ డబ్బు చేతులు మారుతుంది. పోలీస్ ఆఫీసర్ తో పాటు సినిమాలో విలన్లు కూడా ఆ కంటెయినర్ కోసం వెతుకుతుంటారు. అసలు గాంధీ ఎవరు..? ఆ డబ్బు ఎవరిది? హీరో ఎందకు ఆ కంటైనర్ వెనుక పడతాడు? గాంధీకి.. 10 వేల కోట్ల రూపాయలకు ఉన్న సంబందం ఏంటి.. చివరకు ఎవరు ఆ డబ్బును చేజిక్కించుకుంటారన్నదే కథాంశం.
విశ్లేషణ
రాక్షసుడు లాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసిన రమేష్ వర్మ ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ కథను రాసుకున్నాడు. ఈసినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. రాజకీయలను డబ్బు ఎలా శాసిస్తుందో అన్న విషయాన్ని ఈసినిమా ద్వారా చూపించాడు ప్రశాంత్ వర్మ. ముఖ్యమంత్రి అధికారం చేజిక్కించుకోవాలని ఓ రాజకీయ నాయకుడు ప్లాన్ చేస్తాడు. అతని దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని ఓ క్రిమినల్ ప్లాన్ చేస్తాడు. అందుకు క్రిమినల్ తెలివిగా ఎలాంటి గేమ్ ఆడాడో తెలియజేసేదే చిత్రమే ‘ఖిలాడి’. సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సులు, పంచ్ డైలాగ్స్ తోనే ఉంటుంది.
ఇక రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సినిమా అయినా సరే తన ఎనర్జితోనే నడిపించేస్తాడు. ఇక ఇలాంటి పాత్రలు కూడా రవితేజకు కొత్తేమీ కాదు. ఈసినిమాలో కూడా ఎప్పటిలాగానే రవితేజ తన పెర్ఫామెన్స్ తో రెచ్చిపోయాడు. రవితేజ మార్క్ డైలాగ్స్.. ఆయన మార్క్ మ్యానరిజంతో దూసుకుపోయాడు. అటు ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ కూడా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. అర్జున్ చాన్నాళ్ల తర్వాత మంచి రోల్‌లో కనిపించారు. యాక్షన్ కింగ్ అనే పేరుకు తగ్గట్టే ఆయనకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఇక చాలా కాలం తర్వాత ముఖేష్ రిషి తెలుగు స్క్రీన్ మీద సందడి చేశారు. ఇక హీరోయిన్స్ డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. కంచె విలన్ నికితిన్‌కి ఇందులో మంచి రోల్ దక్కింది.ఇక మిగిలినా నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
ఇక సాంకేతిక విభాాగానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తను అందించిన పాటలు ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యాక్షన్ సన్నివేశాలను సంబంధించిన విజువల్స్ చాలా క్లారిటీతో చూపించారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకు వెనక్కి తగ్గలేదని స్క్రీన్ చూస్తేనే అర్థమవుతుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. పక్కా మాస్ యాక్షన్ కమ్ కమర్షియల్ సినిమాలను చూడాలనుకునేవారికి ఖిలాడి నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: