కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేతన్ కుమార్ దర్శకత్వం లో దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన “జేమ్స్ “కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా ఆనంద్ కథానాయిక . చరణ్ రాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ “జేమ్స్ “మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు తాజాగా అన్ని బాషల్లో టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విడుదల అయిన కొద్ది సేపటికే టీజర్ యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధిస్తోంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో , అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రూపొందిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. “జేమ్స్ “మూవీలో పునీత్ రాజ్ కుమార్ కు ఆయన సోదరుడు స్టార్ హీరో శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: