కార్తీక్ దర్శకత్వంలో అశోక్ సెల్వన్, రీతూవర్మ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి నిన్నిలా-నిన్నిలా సినిమా చేయగా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ మూవీకి తమిళంలో ‘నిత్తమ్ ఒరు వానమ్’ టైటిల్ పెట్టగా తెలుగులో ‘ఆకాశం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో అప్ కమింగ్ హీరోయిన్ శివాత్మిక కూడా నటిస్తుండగా.. ‘ఆకాశం నీహద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి కూడా మరో కీలక పాత్రలో నటిస్తుంది. నిత్యామీనన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, మనాలి, వైజాగ్, గోవా, ఢిల్లీ, చండీఘడ్, కోల్ కతా, పొల్లాచి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. విధు అయ్యన సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. తమిళ్, తెలుగులో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: