దేశ వ్యాప్తంగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఒక్క సినిమా కోసమే ఎన్టీఆర్, చరణ్ దాదాపు మూడేళ్లు మరొక సినిమాకు కమిట్ కూడా అవ్వలేదు. అందుకే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి 7న విడుదల చేద్దామని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు.. భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశాడు రాజమౌళి. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాని మార్చి 25న విడుదల చేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఆసక్తి మరింత ఎక్కువైంది. తాజాగా ఒక ప్రమోషన్ లో పాల్గొన్న సెంథిల్ కుమార్.. నిజానికి బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు ఈసినిమా లాంటి పెద్ద సినిమా ఇంక చేయమేమో అనుకున్నా కానీ ఆర్ఆర్అర్ మూవీ బాహుబలిని మించి ఉంటుంది.. ఈసినిమాలోని సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ చూడనివిధంగా ఉంటాయి అని తెలిపాడు. మరి సెంథిల్ కుమార్ చెప్పిన విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: