తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ తల్లి కాబోతున్నారు. అందువల్ల సినిమాలకు దూరం అయ్యారు .ఈ సంవత్సరంలో “ఆచార్య “, “హే సినామిక “, “ఘోస్టీ “(తమిళ ), “ఉమ”(హిందీ ) మూవీస్ తో కాజల్ ప్రేక్షకాభిమానులను అలరించనున్నారు.యూఏఈలో ఉండేందుకు కాజల్ యూఏఈ దేశానికి చెందిన గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లైన దగ్గర నుంచి చందమామలో కొత్త మార్పు కనిపిస్తోంది. లుక్ పరంగా ట్రెడిషనల్ గానే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా చందమామ బీచ్ వ్యూ లో సంధ్యా సమయం లో ఇంటి మేడపైన లేత పసుపు వర్ణం గౌను ధరించి, కూలింగ్ గ్లాసెస్ తో ప్రకృతి ఆరాధన లో అందంగా ఉన్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. స్వీట్ అండ్ క్యూట్ లుక్ లో ఆకట్టుకుంటోన్న కాజల్ ఫోటో వైరల్ గా మారింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: