మళ్లీ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఎలాగూ ఫిక్స్ అయిపోవడంతో చిన్న సినిమాలు.. మినిమం బడ్జెట్ సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా సినిమా రిలీజ్ డేట్లను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా గ్లింప్స్ ని కూడా గతంలో రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దేశభక్తి ఇతడి రక్తంలో ఉందని పేర్కొంటూ మోహన్‌బాబు రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 18న ఈసినిమా విడుదల చేయనున్నారు.
“Collection King” @themohanbabu ‘In & As’ #SonofIndia🇮🇳
Grand Release in Theaters on 18th February⚡️
🎶Maestro #Ilaiyaraaja Musical🎵
Directed by @ratnababuwriter & Produced by @iVishnuManchu@24framesfactory #SreeLakshmiPrasannaPictures @adityamusic #SonofIndiaFromFeb18th 🔥 pic.twitter.com/d6iA4BIRp3— 24 Frames Factory (@24FramesFactory) February 2, 2022
కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: