‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ రిలీజ్

Ashoka vanam lo Arjuna kalyanam Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ashoka vanam lo Arjuna kalyanam,Ashoka vanam lo Arjuna kalyanam Movie,Ashoka vanam lo Arjuna kalyanam Telugu Movie,Ashoka vanam lo Arjuna kalyanam Teaser,Ashoka vanam lo Arjuna kalyanam Movie Teaser, Ashoka vanam lo Arjuna kalyanam Teaser Released,Vishwak Sen,Hero Vishwak Sen Movie Ashoka vanam lo Arjuna kalyanam,Hero Vishwak Sen Movie Ashoka vanam lo Arjuna kalyanam Teaser Out Now, Rukshar Dhillon with Vishwak Sen,Rukshar Dhillon Ashoka vanam lo Arjuna kalyanam,Rukshar Dhillon with Vishwak Sen in Ashoka vanam lo Arjuna kalyanam,Ashoka vanam lo Arjuna kalyanam Release Date on March 4th,

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్ నుండి రీసెంట్ గా వచ్చిన పాగల్ వరకూ విభిన్నమైన కథలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఈసారి కాస్త రూటు మార్చి ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను కొంచం డిఫరెంట్ గా స్టార్ట్ చేశారు. హీరో పోస్టర్ నే త‌న‌కు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేద‌ని జుట్టు పోతుంద‌ని, పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేశారు. ఆ తరువాత రీసెంట్‌గా విశ్వ‌క్ సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. రీసెంట్ గానే ఒక పాటను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండి ఆకట్టుకుంటుంది. టీజర్లో ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనేది కథ. కామెడీ ఎంటర్ టైనర్ గా, ఎమోషన్ గా ఈసినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతుంది టీజర్ ను చూస్తుంటే.

కాగా రుక్సార్‌ దిల్లాన్‌ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు. ఇక టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మార్చి 4వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =