అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా వస్తున్న సినిమా విక్రాంత్ రోణ. ఈసినిమాకు కూడా కరోనా వల్ల చాలా బ్రేక్ లు పడ్డాయి. అయితే ఫైనల్ గా ఈసినిమాను ఫిబ్రవరి 24న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మరోసారి ఈసినిమా రిలీజ్ కు వాయిదా తప్పలేదు. ప్రస్తుతం థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలా సినిమాల రిలీజ్ కు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆలిస్ట్ లో ఈసనిమా కూడా చేరిపోయింది. ఇక ఈ విషయాన్నే చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. పరిస్థితులు నార్మల్ గా ఉంటే ఫిబ్రవరి 24న ఈసినిమా రిలీజ్ చేద్దామనుకున్నాం.. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితులు, కరోనా నిబంధనల ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడం లేదు. సినిమా కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడటం ఇబ్బంది కలిగించే విషయమే. అయితే.. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగా మంచి థియేటర్ అనుభూతి ఇస్తాం.. త్వరలోనే రిలీజ్ డేట్ ను చెబుతామని ట్వీట్ లో పేర్కొన్నారు.
#VikrantRona will meet you on a newer date.
Stay Safe! @KicchaSudeep @anupsbhandari @neethaofficial @Asli_Jacqueline @JackManjunath @Alankar_Pandian @InvenioF @ZeeStudios_ @TSeries @LahariMusic @VikrantRona pic.twitter.com/KMzK4nI142— @shaliniartss (@shaliniartss) January 27, 2022
కాగా జాన్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: