దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గుడ్ లక్ సఖి “ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ .. “గుడ్ లక్ సఖి” చిన్న సినిమా కాదని చాలా పెద్ద చిత్రం అనీ , పలువురు నేషనల్ అవార్డు విన్నెర్స్ ఈ చిత్రానికి పని చేశారనీ , కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , భవిష్యత్తులో ఆమె మరిన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ , ఈ సినిమా కోసం పనిచేసిన మొత్తం నటీనటులు మరియు చిత్ర బృందానికి అభినందనలనీ , “గుడ్ లక్ సఖి”మూవీ సోలోగా రిలీజ్ కావడం అదృష్టమనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: