దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.”గుడ్ లక్ సఖి ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గుడ్ లక్ సఖి “ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొనాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ .. తాను చిరంజీవి కి మెసెంజర్ గా ఈ ఈవెంట్ కు వచ్చాననీ , ఈ ఈవెంట్ లో పాలుపంచుకొనడం హ్యాపీ గా ఉందనీ , డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న సుధీర్ , శ్రావ్య లు నిర్మాతలుగా మారినందుకు శుభాకాంక్షలనీ , దర్శకుడు నగేష్ మూవీస్ కాలేజ్ డేస్ లో చూశాననీ , స్టేజ్ మీద ఆయనతో కలసి స్టేజ్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందనీ , “మహానటి “మూవీ చూసిన తరువాత కీర్తి సురేష్ కు అభిమాని గా మారాననీ చేప్పారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ ,, “మహానటి ” మూవీ తరువాత “గుడ్ లక్ సఖి ” మూవీ కి సైన్ చేశాననీ , తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత , దర్శకులకు థ్యాంక్స్ అనీ , దర్శకుడు వద్ద చాలా నేర్చుకున్నాననీ , ఆ క్యారెక్టర్ లో నటించడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారనీ , ఈ ఈవెంట్ కు వచ్చినందుకు రామ్ చరణ్ కు థ్యాంక్స్ అనీ , RRR మూవీ కై ఆసక్తితో ఎదురు చుస్తున్నాననీ చెప్పారు. దర్శకుడు నగేష్ మాట్లాడుతూ .. తాను తెలుగువాడి ననీ , హైదరాబాదీ అని చెప్పుకొనడానికి గర్వపడుతున్నాననీ , ఈ మూవీ చేయడానికి కీర్తి సురేష్ కారణమనీ , దేవిశ్రీ ప్రసాద్ తో వర్క్ ఎంజాయ్ చేశాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: