‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

Mahesh Babus Sarkaru Vaari Paata Movie First Single Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Telugu Movie Updates,Sarkaru Vaari Paata Latest Updates,Sarkaru Vaari Paata Upcoming Movie, Mahesh Babus Sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu Mpvie Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Single update,Sarkaru Vaari Paata Tollywood 2022 Movie, Mahesh Babu, Mahesh Babu Movies,Mahesh Babus New Movie,Mahesh Babu Latest Movies,Mahesh Babu Latest News,Mahesh Babu Latest Updates,Mahesh Babu Movie News,Parasuram,Parasuram Director Parasuram, Parasuram Movies,Parasuram lates Movie Sarkaru Vaari Paata,Parasuram Upcmoing Movies,Single Melody Song on Feb 14th,#SarkaruVaariPaataMusic,#SarkaruVaariPaata

వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో మహేష్ కాస్త స్టైలిష్ లుక్ లో గతంలో చూసిన విధంగా కనిపిస్తుండటం.. దానికి తోడు ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లకు గానీ.. గ్లింప్స్ కు గానీ సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టనుంది చిత్ర యూనిట్. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి కానీ మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగడం.. ఆ తర్వాత మళ్లీ మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో షూటింగ్ బ్రేక్ పడింది. దీంతో సర్కారు వారి పాట నుండి అప్ డేట్స్ కూడా ఆగిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ కూడా త్వరగా స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేశారు. దీనిలోభాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం నుంచి ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆరోజున ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా రిలీజ్ చేయనున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతోన్న ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా చిత్రీకరించినట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మది సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.