ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా ఎంత ఉందో చూస్తూనే ఉన్నాం. అందుకే సినిమాలు చేస్తున్నా కూడా స్టార్ హీరో హీరోయిన్స్ సైతం ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే ఎంతో మంది వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ , స్టార్ డైరెక్టర్ కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు-హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్. ఈసారి వెబ్ సిరీస్ తో రాబోతున్నారు వీరిద్దరూ. ఏటీఎం అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. హరీష్ శంకర్ కథను అందించగా దిల్ రాజు ఈ సిరీస్ ను నిర్మించనున్నారు. సి. చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం కూడా వహించనున్నారు. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే – దువ్వాడ జగన్నాథం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ వెబ్ సిరీస్ రానుంది.
Thank you Director @Chandramohan__C am sure you gonna rock …. Let’s begin the Robbery!!!! pic.twitter.com/7vl7otyeH6
— Harish Shankar .S (@harish2you) January 27, 2022
ఇక హరీష్ ఇప్పటికే పవన్ తో సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే ఈసినిమాకుసంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడు. త్వరలో ఈసినిమాను కూడా స్టార్ట్ చేయనున్నాడు. ఇక దిల్ రాజు కూడా పలు పెద్ద ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. ఒక వైపు చిన్న సినిమాలు చేస్తూనే మరోవైపు శంకర్ తో విజయ్ తో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. జెర్సీ, హిట్ రీమేక్ లతో హిందీ లో కూడా అడుపెట్టేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: