కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఫైనల్ గా మార్చి 18 హోలీ రోజున ఈసినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్లు రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నిన్న వరుణ్ తేజ్ తన పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. దీంతో తనకు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అందరూ తనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో వరుణ్ తేజ్ తన ఇన్ట్సా ద్వారా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్నేళ్లు నాపై ప్రేమను, సపోర్ట్ ను అందించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా.. ఈ ఏడాది మీకు ఫైర్ అందిస్తా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా నదియా, జగపతిబాబు ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: